రామగుండంలో రౌడీరాజ్యం నడుస్తోంది.
గోదావరిఖని: రామగుండంలో రౌడీ రాజ్యం నడుస్తోందని,స్థానిక ఎమ్మెల్యే అన్ని శాఖల అధికారులతో దౌర్జన్యాలు చేయిస్తున్నాడని బీఆర్ఎస్ సీనియర్ నేత కౌశిక హరి ఆరోపించారు. సోమవారం హనుమాన్ నగర్ కు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి స్థానిక వన్ టౌన్ సిఐల మధ్య జరిగిన ఘర్షణ నేపధ్యంలో మంగలవారం ఆయన శ్రీనివాస్ ను కలిసి పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఎమ్మెల్యే మక్కాన్ సింగ్,స్థానిక పోలీసు,మున్సిపల్,సింగరేణి అధికారులపై తీవ్ర ఆరోపణలు చేసారు.ఊహించని ఓ బలహీన పరిస్థితిలో ఓట్లు వేసిన పాపానికి అధికారపార్టీ ప్రజాప్రతినిధులు,నేతలు ప్రజలను రోడ్డు పాలుచేస్తూ నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు.
వన్ టౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి చేసిన దౌర్జన్యాన్ని కఠినంగా ఖండిస్తున్నామన్నారు. ఎవరో ఆజ్ఞలకు ఇలా చేయడం సరి కాదని పోలీసులకు సూచించారు.అంతర్గాం ఎస్సై సైతం యూనిఫాం వేసుకుని ఎమ్మెల్యే వ్యక్తిగత మనిషిగా వ్యవహరిస్తున్నాడని తెలిపారు.టెండర్లు పొందిన బూడిద కాంట్రాక్టర్లంతా తమ క్వాంటిటీలన్నీ మక్కాన్ సింగ్ బినామీ ఎబిసి రెడ్డికి ఇచ్చేయాలని బెదిస్తున్నాడన్నారు. కావాలంటే ఉద్యోగాలకు రాజీనామా చేసి మక్కాన్ సింగ్ సైన్యంలో చేరండనీ, లేదంటే మక్కాన్ సింగ్ సేవా సమితిలోనో, కాంగ్రెస్ పార్టీలోనో చేరి కార్పొరేటర్‌గా లేదా ఎమ్మెల్యేగా పోటీ చేయండని సూచించారు.
రామగుండంలో ప్రజాస్వామ్యం లేదన్నారు. అధికారిక వ్యవహారమే లేదని,నిర్ణయాలన్నీ కేవలం ఒకే గూటి శక్తులవే అనే విమర్శలు వినిపిస్తున్నాయని హరి గుర్తుచేసారు.
సరైన రూట్ మ్యాప్, రోడ్డు వెడల్పు గురించి ప్రణాళిక లేకుండా మార్పులు చేయడం, ట్రాఫిక్, భద్రతా అంశాలను భవిష్యత్తులో తీవ్రంగా ప్రభావితం చేస్తాయన్నారు.గ్రేటర్ పరిధిలో ఉన్న అభివృద్ధి నమూనాను రామగుండంలో తక్షణమే వర్తింప చేయాలనుకోవడం సాధ్యం కాదన్నారు.నువు తప్పుడు మార్గాల్లో ఎదిగి ఉంటున్న విల్లాల్లా ఊరంతా ఉండాలనుకోవటం సాధ్యపడదని హరి రాజ్ ఠాకూర్ కు గుర్తుచేసారు.సింగరేణి మున్సిపాలిటీ పరిధిలో ఎవరు, ఎటువంటి కూల్చివేతలు,పునర్నిర్మాణాలు జరుపుతున్నారో స్పష్టత లేదని, సాధారణ ప్రజలు, సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారన్నారు.ఏ అధికారితో సంప్రదింపులు లేకుండా సింగరేణి మున్సిపాలిటీలు కూలగొట్టడాలు చేస్తున్నారనీ ,అసలు కూల్చే అధికారం వీరికి ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. వీటన్నిటికీ పట్టాలు ఉన్నాయన్నారు.ఎమ్మెల్యే మక్కాన్ సింగ్‌కు దమ్ము లేదనీ, పోలీసు, రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులను వాడుకొని ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. ఓసీ ఫైవ్, బూడిద,హెచ్ కేఆర్,మెడికల్ ఆసుపత్రి ఉద్యోగాలు, మట్టి మీద మక్కాన్ సింగ్ డబ్బులు సంపాదిస్తున్నాడని ఆరోపించారు. అలాగే ప్రభుత్వ సంస్థల్లో ఉద్యోగాల అమ్మకాల అవినీతిపై ఘాటుగా స్పందించారు. ఎన్టీపీసీ, ప్రభుత్వ ఆసుపత్రిలో ఉద్యోగాలు ఎవరి ఆధ్వర్యంలో అమ్ముకుంటున్నారని ప్రశ్నించారు. నీవు ఎమ్మెల్యేగా గెలిచాక ఎందరికి ఎన్ని ఉద్యోగాలొచ్చాయన్నారు.
30 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నీ సొంత నాయకులకు కూడా ఉపాధి చూపించలేకపోయావని కౌశికహరి ఎద్దేవా చేసారు. అధికారులు,ప్రజాప్రతినిధులు విధుల్ని మరిచి చట్టవ్యతిరేకంగా విద్వంసాలు చేస్తున్నారని హరి ఆగ్రహం వ్యక్తంచేసారు. ఇప్పటికైనా అలాంటివి మానుకోకపోతే రాబోయే తమ ప్రభుత్వంలో శిక్ష తప్పదని హెచ్చరించారు. అధికారులు ప్రజలతో సంప్రదింపులు జరిపి నిర్ణయాలు తీసుకోవాలని,లేని పక్షంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలతో కలిసి ఉద్యమానికి దిగుతుందని స్పష్టంచేసారు. ఆయనవెంట నేతలు పర్లపల్లి రవి,మాదాసు రామ్మూర్తి,బొడ్డు రవి తదితరులు ఉన్నారు.









